నిరాశ తప్పదా?

తమిళ్ స్టార్ హీరో సూర్య చేస్తున్న కంగువ కోసం కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు పాన్‌ ఇండియా వైడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది కూడా . ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ విజువల్స్ తో కూడిన సినిమా “కంగువ” తాజాగా వాయిదా పడింది. 

ఈ చిత్రానికి అసలు విడుదల తేదీ అక్టోబర్ 10. అయితే, రజనీకాంత్ ‘వెట్టయన్’ ఆ తేదీని తన సొంతం చేసుకోవడంతో  “కంగువ” టీమ్ మరో తేదీని వేటలో పడింది. అనేక సమీకరణాలను బట్టి లెక్కలు వేసుకున్న తర్వాత సినిమాని నవంబర్ 14వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొదట్లో, నిర్మాతలు “పుష్ప 2” వాయిదా గురించి ఊహాగానాల కారణంగా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయాలి అనుకున్నారు. 

అయితే కచ్చితంగా పుష్ప డిసెంబర్ 6న రావడం ఖాయమని మేకర్స్ తేల్చి చెప్పడంతో నవంబర్ 14వ తేదీని కొత్త తేదీగా మూవీ టీమ్‌ సెలెక్ట్‌ చేసుకుంది. నిజానికి “కంగువ” వంటి భారీ బడ్జెట్ చిత్రానికి ఇది సరైన తేదీ కాదు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో భారతదేశం అంతటా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఈ సినిమాకి హిందీ మార్కెట్ కీలకంగా  మారనుంది. శివ దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories