సినిమా రంగుల ప్రపంచంలో ప్రేమ, పెళ్లి , విడాకులు అనేవి చాలా కామన్ విషయాలు. ఇలా చాలా మంది నటినటులు తమ భాగస్వాముల నుంచి విడిపోవడం.. తరువాత వారి గురించి ఏదోక సందర్భంలో వారు అనుభవించిన బాధ, కష్టాల గురించి చెప్పి ఎమోషనల్ అవ్వడం మనం చాలా సందర్భాల్లో చూస్తునే ఉంటున్నాం.
తాజాగా ఓ బాలీవుడ్ నటి తన మాజీ భర్త గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తరువాత హానీమూన్ కి వెళ్లిన సమయంలో తనతో పాటే కాకుండా తన స్నేహితులతో కూడా సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేయడంతో పాటు.. స్నేహితులకు తనను వేలం వేసినట్లు తెలిపి బాధపడింది.
ఆమె మరెవరో కాదు..ఒకనాటి బాలీవుడ్ అందాల తార కరీష్మా కపూర్. బాలీవుడ్ లో కపూర్ ల కుటుంబానికి మంచి పేరు ఉంది. వీరి కుటుంబం నుంచి వచ్చిన కరీష్మా కపూర్ ప్రేమ ఖైదీ అనే సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలో అడుగులు మొదలు పెట్టింది. తరువాత వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ నాయికగా ఎదిగింది.
ఇలా ఇండస్ట్రీలో పదేళ్ల పాటు తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలోనే ఆమె చాలా అవార్డులను కూడా కైవసం చేసుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే హీరో అజయ్ దేవగణ్ తో ప్రేమాయణం సాగించింది. కానీ అది వర్కౌట్ అవలేదు. ఆ తరువాత అభిషేక్ బచ్చన్ ను ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది.
ఆ తరువాత ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ తో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా కెరీర్ ను ముందుకు నడిపింది. కానీ కొంతకాలానికి సంజయ్ తో వివాహ బంధానికి బై చెప్పింది. తాజాగా ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.