ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం ఖర్చుతో సరికొత్త ప్రచార ఆర్భాటాన్ని ప్రారంభించారు. ‘నీకల- నాకల’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫ్లెక్సిలను వేయిస్తున్నారు. మొన్నమొన్నటిదాకా ‘సిద్ధం’ పేరుతో ఒక ప్రచార ఆర్భాటం నడిచింది. సిద్ధం సభల పేరుతో 600 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ప్రచారానికి తగలేశారని విపక్షాలతో పాటు, స్వయంగా ఆయన చెల్లెలు కూడా ఆరోపించింది. సిద్ధం సభలు అయిపోయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి బుర్రలోంచి ఇప్పుడు సరికొత్త ప్రచార ప్రహసనం మొదలైంది! ‘నీ కల – నాకల’ అంటూ ఆయన మళ్లీ రాష్ట్రాన్ని ఊదరగొట్టడానికి ప్రిపేర్ అయిపోయారు.
రాష్ట్రమంతా ఇప్పుడు సరికొత్త ఫ్లెక్సి పోస్టర్లు వెలుస్తున్నాయి. ‘అవ్వతాతల కల.. నా కల’, ‘అక్క చెల్లెమ్మల కల.. నా కల’, ‘ప్రతి బిడ్డ కల.. నా కల’.. అంటూ రకరకాలుగా అన్ని వర్గాల వారిని కవర్ చేసేలా వారి కలలన్నీ నా కలలు అని చెప్పుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో ఫ్లెక్సిలు తయారు చేశారు. తద్వారా ప్రజల్లో అన్ని వర్గాల వారి కలలను తన కలలుగా మార్చుకుని వాటిని నెరవేరుస్తానని జగన్ హామీ ఇస్తున్నట్ఠుగా వారు భావించుకున్నారు. అయితే ఈ ‘కలల నినాదాలు’ ప్రజల వెటకారానికి గురవుతున్నాయి.
‘అమరావతి రాజధాని అనేది రాష్ట్ర ప్రజల కల.. అమరావతిని స్మశానంగా మార్చేయడం అనేది నీ కల’, ‘స్థిమితంగా బతకాలనేది ప్రజల కల.. ఒక్కో కుటుంబానికి వంద రూపాయలు అందించి.. వెయ్యి రూపాయలు కాజేయడం ద్వారా కుటుంబాలను ఆందోళనల్లోకి నెట్టడం నీ కల’, ‘నకిలీ మద్యం సీసాలతో ప్రజల ప్రాణాలు తీసి, అక్కచెల్లెమ్మల తాళిబొట్లు తెంచడం నీ కల’ అన్నట్లుగా జగన్ ను ఉద్దేశించి జనం కౌంటర్ విమర్శలు చేస్తున్నారు.
మళ్లీ నెగ్గడం, రాష్ట్రంలో మిగిలి ఉన్న వనరులన్నిటినీ కూడా దోచుకోవడం, అంతో ఇంతో మిగిలిన ఉన్న రాష్ట్రాన్ని యావత్తుగా విధ్వంసం చేయడం మాత్రమే జగన్ కల అని ప్రజలు అంటున్నారు. ఈసారి గెలవాలని, ఈసారి గెలిస్తే ఇంకో ముప్పయ్యేళ్లపాటు ముఖ్యమంత్రిగా తానే ఉండిపోతానని తన కలను గురించి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకున్న వైనం ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. ప్రజలందరి కలలను తన కలలుగా భావిస్తానని అనడం ప్రజలకు కామెడీగా కనిపిస్తోంది. అందుకే జగన్ వైఖరి గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రం.. ‘జగన్.. నీ కల అధికారం.. ప్రజల కల నీ పతనం’ అని సింగిల్ లైన్లో అభివర్ణిస్తున్నారు. మరి జగన్ ఇలాంటి కుయుక్తుల మాయమాటల ప్రచారాలు ఎలాంటి ఫలితమిస్తాయో చూడాలి.
ReplyForwardAdd reaction |