చరణ్‌ కి సామ్‌ విషెస్‌ …కొన్ని ట్విస్ట్ ఏంటంటే..!

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌, అందాల ముద్దుగుమ్మ సమంత కలిసి నటించిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాని స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సరికొత్తగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అటు చరణ్‌ నటనకు కానీ, ఇటు సమంత యాక్టింగ్‌ కు కానీ అభిమానులు ఫిదా అయిపోయారు.

ఆ సినిమా తరువాత చరణ్‌ సామ్‌ కలిసి నటించింది లేదు. ఈ క్రమంలోనే బుధవారం చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా సమంత ప్రత్యేకంగా విషెస్‌ చెప్పింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటంటే సామ్‌ మామూలుగా విషెస్‌ చెప్పలేదు. హ్యాపీ బర్త్ డే ఓడీ రాంచరణ్‌…నీలా ఉండడం అనేది ఎవరికీ సాధ్యం కాదు అంటూ రాసుకొచ్చింది.

ఇక్కడ వరకు బాగానే ఉంది. సామ్‌ పెట్టిన పోస్ట్‌ లో చరణ్‌ ని ఓజీ అని సంభోందించడమే ఇప్పుడు అభిమానుల్లో కొత్త అనుమానాలను రేపుతుంది. ఎందుకంటే పవన్‌ కొత్త సినిమా పేరు ఓజీ. దానిని చరణ్‌ కి వాడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పోస్ట్‌ చూసిన మెగా అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

బాబాయ్‌ టైటిల్‌ తో చరణ్‌ కు విషెస్‌ చెప్పడం అనేది నెక్స్ట్‌ లెవల్ అంటూ సామ్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సామ్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories