కింగ్డమ్‌ ట్రైలర్‌ ఎప్పుడంటే!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కుతున్న భారీ చిత్రం “కింగ్డమ్” గురించి సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తుండగా, ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, పోస్టర్లతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయ్యేసరికి, ప్రమోషన్స్ వేగం అందుకోవాల్సిన తరుణంలో ట్రైలర్ రిలీజ్‌పై క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.  అధికారిక ప్రకటన రాకపోయినా, ఫ్యాన్స్‌లో ఇప్పటికే దీనిపై మంచి హైప్ నెలకొంది. ట్రైలర్ ద్వారా విజయ్ దేవరకొండ మరోసారి మాస్ అవతారంలో ఎలా కనిపించబోతున్నాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం అనిరుద్ రవిచందర్ అందించగా, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్నిచ్చే అవకాశం ఉంది. నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి చేపట్టిన ఈ సినిమా, విజువల్స్ పరంగా కూడా టెక్నికల్‌గా రిచ్‌గా ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్డమ్” సినిమా ప్రమోషన్లకు ఈ ట్రైలర్ ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఒకవేళ ట్రైలర్ 25న విడుదలైతే, ఆ రోజు అభిమానులకు పక్కా ఫెస్టివల్ మూడ్ ఏర్పడటం ఖాయం.

Related Posts

Comments

spot_img

Recent Stories