రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారాం ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రాన్ని దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ విడుదలై సూపర్ హిట్ అయ్యాయి.
ఈ సినిమా ఏప్రిల్ 5న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. రిలీజ్ తేదీ దగ్గరకు వస్తుండడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషనస్ మొదలు పెట్టేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కల్యాణి వచ్చా..వచ్చా.. పంచ కల్యాని తెచ్చా తెచ్చా అంటూ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వస్తుందని తెలుస్తోంది.
పెళ్లి సందడిని ఈ పాటు రెట్టింపు చేసేలా ఉంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా..మంగ్లీ..కార్తీక్ మంచి ఊపు వచ్చేలా పాడారు. గోపి సుందర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ పాటలో విజయ్ కానీ, మృణాల్ కానీ ధరించిన దుస్తులు గురించి అయితే చెప్పుకోనవసరం లేదు. వేరే లెవల్ అంతే.
పాట మొత్తం రాయల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లా అనిపిస్తుంది. ఈ సాంగ్ విజువల్స్ చూసిన ప్రేక్షకులు అయితే మిడిల్ క్లాస్ అన్నావ్ కదా అన్నా..అంబానీ రేంజ్ లో పెళ్లి చేసుకుంటున్నావ్ ఏంటంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతకు ముందు రిలీజైన టీజర్ లో ఏమో పిల్లను ఎక్కించుకుని డ్రాప్ చేయడానికే వంద పెట్రోల్ కొట్టిస్తా అని చెప్పాడు.
ఇప్పుడేమో కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడా? అంటూ పంచ్ డైలాగ్ లు వేస్తున్నారు.