కమలం పువ్వులో జగన్ కోవర్టు పురుగులు!

తెలుగుదేశం జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2014లో పొత్తుల నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. 2019లో దారుణమైన పరాభవం ఎదురైనప్పటికీ.. ఇప్పుడు తిరిగి పొత్తుల్లో ఉండడం వలన.. 2014 కంటె మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ఆశ వారిలో ఉంది. దేశంలో మోడీ హవా పెరగడం, రామాలయం ప్రారంభించిన అనుకూల పరిస్థితులు అన్నీ కలిసి తమకు దక్కే స్థానాలు పెరుగుతాయని కోరుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో.. భారతీయ జనతా పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కోవర్టులు కొందరు.. పొత్తుల తర్వాత సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక సజావుగా ముందుకు నడవకుండా ఆటంకాలు సృష్టిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏపీ భారతీయ జనతా పార్టీలో తొలినుంచి రెండు గ్రూపులు ఉన్నాయి. మెజారిటీ గ్రూపు పొత్తుల్లోకి ఎంటరై పార్టీని కాపాడుకోవాలని, ఒంటరిగా వెళ్తే మరో పరాభవాన్ని మూటగట్టుకోవాల్సిందే అని వాదించే వర్గం. కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవర్టులుగా గుర్తింపు ఉన్న మరి కొందరు నాయకులు మాత్రం.. పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. తీరా పొత్తులు కుదిరిన తర్వాత, ఇన్నాళ్లూ పొత్తులనే వ్యతిరేకించిన జగన్ కోవర్టులు హఠాత్తుగా తెరమీదకు వచ్చి తమకు టికెట్ కావాలని మొండికేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏ నేతలైతే తెలుగుదేశం, జనసేనలతో కనీస స్నేహసంబంధాలు కూడా లేకుండా ఇన్నాళ్లుగా మోనార్క్ లుగా వ్యవహరిస్తూ వచ్చిన వారు బరిలోకి దిగితే గనుక.. స్థానికంగా వారికి సహకరించడం అనేది తెదేపా, జనసేన నాయకులకు, కేడర్ కు చాలా అవమానకరంగా ఉంటుంది. సహకారం పూర్తిస్థాయిలో అందే అవకాశం తక్కువ. తమ పార్టీ ఓడిపోయినా పర్లేదు గానీ.. తెదేపా సహకరించలేదు అనే నిందలు వేయడానికి తామే రంగంలో ఉండాలని వారు కోరుకుంటున్నారు.

ఎమ్మెల్యే ఎన్నికల సీట్ల ఎంపిక విషయంలో కూడా అలాంటి మడతపేచీ ఎదురైంది.పలు నియోజకవర్గాల కోసం జగన్ కోవర్టులు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. తాము ఓడిపోయి, తద్వారా తెలుగుదేశం అధికారంలోకి రాకుండా చూడాలనే కుట్రాలోచనతో వారు పనిచేస్తున్నట్టు గుసగుసలున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు  ఇలాంటి పరిణామాలను క్షేత్రస్థాయిలో ఊహించలేకపోతున్నారు. దాంతో తమ పార్టీ తరఫున ఏయే సీట్లు, అలాగే అబ్యర్థులు ఎవరు అనేది తేల్చడం కొంత ఆలస్యమయ్యేలా ఉన్నదని తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories