ఓ పూట కడుపు నింపుకోవడానికి ఆ పనులు చేసేదాన్ని!

వైష్ణవి చైతన్య… సాఫ్టేవేర్‌ డెవలపర్‌ అనే షార్ట్‌ ఫిలిం ద్వారా సోషల్‌ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకుంది.ఆ తరువాత ఆమె చాలా వెబ్‌ సిరీస్‌ లు చేసినప్పటికీ బేబీ సినిమా మాత్రం వైష్ణవిని ఓవర్‌ నైట్‌ స్టార్‌ చేసేసింది. ఆ సినిమాలో తన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ చిత్రంలో వైష్ణవి అందానికి కుర్రకారు గుండెల్లో గుడి కట్టేశారు.

ఫస్ట్‌ సినిమాతోనే తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న వైష్ణవి పై మెగాస్టార్‌ చిరంజీవి సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఇది ఇలా ఉంటే తాజాగా వైష్ణవి ఓ ఛానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ స్టార్టింగ్‌ లో పడిన ఇబ్బందులు గురించి , ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యింది.

చిన్నతనంలోనే ఇంటి బాధ్యతలు పట్టాల్సి వచ్చిందని తెలిపింది. పూట గడవడం కోసం రాత్రి పూట పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి ఈవెంట్స్ లో డ్యాన్స్‌ చేసేదాన్ని అని వివరించింది. పుట్టిన రోజు వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తే రూ. 700 ఇచ్చేవారని… ఆ డబ్బుతో అమ్మ మా కడుపు నింపేదని వివరించింది.

ఆ తరువాత మెల్లగా యూట్యూబ్‌ వీడియోలు చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో డ్రెస్‌ మార్చుకోవడానికి కూడా కనీసం రూమ్‌ ఉండేది కాదు. బాత్‌ రూమ్‌ లోనే బట్టలు మార్చుకోవాల్సి వచ్చేదని వివరించింది. ఓ సినిమాలో చిన్న పాత్ర చేస్తున్న సమయంలో అయితే క్యారవాన్‌ వాడుకోవచ్చా అని అడిగితే… వారు చాలా అవమానకరంగా మాట్లాడరంటూ ఎమోషనల్‌ అయ్యింది వైష్ణవి.

వాళ్లు అలా మాట్లాడడంతో అమ్మ చాలా ఏడ్చింది. అప్పుడే జీవితంలో ఏదోకటి సాధించాలని గట్టిగా అనుకున్నాను. వైష్ణవి అన్న మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. వైష్ణవి చేతిలో ప్రస్తుతం 4 సినిమాలు ఉన్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories