No menu items!
No menu items!

ఆ వార్తల్లో నిజం లేదు..ఎవరు నమ్మకండి: మంచు మనోజ్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో, మంచు మోహన్‌ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్‌ , ఆయన భార్య భూమా మౌనిక రెడ్డిలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది. అది ఏంటంటే… కొద్ది రోజుల కిందట మంచు మనోజ్‌ దంపతులు తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు.

ఈ విషయాన్ని మనోజ్‌ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలపడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలిపి..బుల్లి మనోజ్‌ కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు పెట్టారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది… అసలు సమస్య ఏంటంటే… మౌనిక కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని నిన్నటి నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

దీంతో ఈ విషయం మనోజ్‌ కంట పడడంతో దీని పై ఓ మనోజ్‌ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ” ఈ విషయం నిజం కాదు. ఏదైనా విషయం ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం.. మాకు కవలలు పుడతారు అనే దానిలో నిజం లేదు. ప్రస్తుతం మౌనిక ఏడు నెలల గర్భవతిగా ఉంది. మరో రెండు నెలలు అంటే మే నెలలో మా ఇంటికి బిడ్డ రాబోతుంది. అప్పటి వరకు ఎవరూ కూడా దయచేసి ఇలాంటి వార్తలను వ్యాపింపచేయవద్దు.ఇదే నా విన్నపం అంటూ” మనోజ్‌ రాసుకొచ్చాడు.

చాలా సంవత్సరాలుగా మీ ప్రేమ , అప్యాయతలు అందజేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మనోజ్‌ తెలిపాడు. ప్రస్తుతం ఈ సంగతి కూడా నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

మంచు మనోజ్‌ కు భూమా మౌనికతో గతేడాది వివాహం జరిగింది. వీరిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లే.. ముందు ఇద్దరికీ విడాకులు అయ్యాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories