అమ్మాయిలను వదిలేసి ఆంటీల వెనుక పడరా!

ఆ ఒక్కటీ అడక్కు… అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్‌, రావు గోపాల రావు నటించిన కామెడీ చిత్రం ఆ ఒక్కటి అడక్కు… ఇప్పుడు అదే పేరుతో అల్లరి నరేష్ ఓ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని రాజీవ్‌ చిలక.. చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్‌ గ్లింప్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 22 న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకుని వచ్చేందుకు చిత్ర బృందం రెడీ అయిపోయింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర ప్రమోషన్స్‌ ని చిత్ర బృందం మొదలు పెట్టేసింది. మంగళవారం ఈ సినిమా టీజర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఆ టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అల్లరి నరేష్‌ చాలా కాలంగా కామెడీ కథలను ఎంచుకోవడం లేదు. సీరియస్‌, యాక్షన్‌ సినిమాలను చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన కామెడీ మార్క్‌ ను చూపించేందుకు రెడీ అయిపోయాడు. మంగళవారం విడుదలైన టీజర్‌ మొత్తం కామెడీతో ఉంది.

ఈ టీజర్‌ లో రఘుబాబు 25 రోజుల 10 గంటల 10 నిమిషాల్లో పెళ్లి జరిగితేనే..లేకపోతే ఆజన్మ బ్రహ్మచారి.. ఆంజనేయుడే అనే డైలాగ్‌ తో టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ వయసు ముదిరిపోతున్న పెళ్లికొడుకుగా..నటిస్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్లిన అక్కడి వారంతా నరేష్‌ ని అడిగే ప్రశ్న పెళ్లేప్పుడు అంటూ… దీంతో ప్రేమ వివాహం అయినా చేసుకోవాలని నరేష్‌ నిర్ణయించుకుంటాడు.

హీరోయిన్‌ ని చూసి ప్రేమలో పడతాడు. ఆ విషయం ఆమెకి చెప్పి పెళ్లి చేసుకుంటా అంటాడు . కానీ హీరోయిన్‌ మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటూ అంటుంది. దీంతో కథ మళ్లీ మొదటికి వస్తుంది. అసలు గణకు ఎందుకు పెళ్లి కావడం లేదు. హీరోయిన్‌ ఎందుకు పెళ్లికి ఒప్పుకోవడం లేదు అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటుంది చిత్ర బృందం.

ముఖ్యంగా ఈ సినిమాలో అల్లరి నరేష్‌, వెన్నెల కిషోర్‌ కాంబోలో వచ్చే పంచ్‌ డైలాగ్‌ లు మాత్రం వేరే లెవల్‌ అని చెప్పాల్సిందే. టీజర్‌ చివరిలో  పెళ్లి కోసం అమ్మాయిలను వదిలేసి ఆంటీల వెనుక పడరా అని వెన్నెల కిషోర్‌ అంటే.. అల్లరి నరేష్‌ మరదులు..ఎవరైతే ఏంటన్నయ్య..పెళ్లి జరిగితే అదే పదివేలు అని చెప్పే డైలాగ్‌ అయితే సినిమాకే హైలెట్‌ గా నిలిచింది. మరి ఈ సినిమా అల్లరి నరేష్‌ కు భారీ విజయాన్ని ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories