విడాకులు తరువాత కూడా భర్త పేరును ప్రస్తావిస్తున్న రజినీ కుమార్తె!

రజినీ కాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య..స్టార్ నటుడు ధనుష్‌ వివాహ బంధం నుంచి బయటకు వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఐశ్వర్య ధనుష్‌ లది ప్రేమ వివాహం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తరువాత వీరిద్దరూ ఇక ఆ బంధానికి స్వస్తి పలికారు.

ఆ తరువాత ఇద్దరు ఎక్కడ కూడా తమ వ్యక్తిగత జీవితాలను గురించి ప్రస్తావించలేదు. కానీ పిల్లల కోసం స్కూల్‌ ఫంక్షన్స్‌ వంటి వాటిలో పాల్గొంటున్నారు. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పెడుతున్నారు కూడా. దాని తరువాత ఎక్కడ కూడా ఇద్దరు ఎప్పుడూ తమ జీవితాల గురించి మాట్లాడింది లేదు.

కానీ తొలిసారి ఐశ్వర్య తన మాజీ భర్త ధనుష్‌ గురించి మీడియా ముందు మాట్లాడింది. ఆమె దర్శకత్వం వహించిన లాల్‌ సలామ్‌ హిట్‌ అవుతుందనుకుంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూకి హాజరు అయ్యింది. ఈ క్రమంలో యాంకర్‌ మీరు సినిమా ప్రపంచానికి పరిచయం చేసిన అనిరుధ్‌ ఇప్పుడు ప్రపంచం గర్వించే స్థాయిలో ఉన్నాడు. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగగా… దానికి ఆమె నవ్వుతూ దానికి కారణం నేను కాదు.. ధనుష్‌ అని సమాధానమిచ్చింది.

అనిరుధ్‌ ను విదేశాలకు పంపి చదివించాలని అతని తల్లిదండ్రులు భావించారు.. కానీ వారికి నచ్చజెప్పి అనిరుధ్‌ కు ధనుష్‌ కీ బోర్డు కొనిచ్చాడు. ధనుష్‌ నటించిన 3 సినిమాకు అనిరుధే కంపోజ్‌ చేయాలని కూడా తెలిపాడు. అనిరుధ్‌ ఈరోజు మంచి పొజిషన్‌ లో ఉండడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు.

ఇలా ధనుష్‌ గురించి ఐశ్వర్య ప్రస్తావించడంతో అభిమానులు ఆశ్చర్చపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories