గులకరాయి డ్రామా: సతీష్ మీదనే పగబట్టారెందుకంటే..?

సరిగ్గా ఎన్నికల ప్రచార పర్వంలో జరిగిన సంఘటన! ప్రజలు ఓట్లు వేసేదాకా ఎన్ని రకాలుగా అయినా తమ మీద సానుభూతి కురిసేలా మలచుకోవడానికి వీలున్నటివంటి సంఘటన! దాని విలువ కేవలం రెండు లక్షలు మాత్రమేనా? గట్టిగా చెప్పాలంటే కోటిరూపాయలైనా ఇచ్చి ఉండొచ్చు. కానీ.. జగన్ మీద గులకరాయి విసిరింది నేనే అని ఒక కుర్రవాడితో ఒప్పించడానికి పోలీసులు రెండు లక్షలు మాత్రమే ఆఫర్ చేయడానికి వెనుక మర్మం ఏమిటి? అయినా వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే ఆ కుర్రవాడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు. ఏదో పగబట్టినట్టుగా అతడితో మాత్రమే నేరం ఒప్పించడానికి ఎందుకు ప్రయత్నించారు. తుపాకీ తలమీద పెట్టి చంపేస్తామని బెదిరించేంత అవసరం ఏముంది? నేరం తానే చేసినట్టు ఒప్పుకోకపోతే.. తల్లిదండ్రుల్ని చంపేస్తాం అనవలసినంత సీరియస్ నెస్ ఉందా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో విచ్చలవిడిగా సాగుతున్నాయి.
సాధారణంగా మనం సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటాం. ఒక కీలకమైన నేరం జరుగుతుంది. పోలీసులు చాలా వేగంగా ఆ నేరం చేసిన వాడిని పట్టుకునేస్తారు. వాడేమో చాలా సింపుల్ గా కోర్టులో కూడా నేరం చేసినట్టు ఒప్పేసుకుంటాడు. జైలుకెళ్తాడు. తీరా, అలా జైలుకెళ్లిన వాడి కుటుంబానికి, నిజంగా నేరం చేసిన వారినుంచి భారీగా డబ్బులు ముడుతాయన్నమాట.
కానీ జగన్మోహన్ రెడ్డి మీద చిన్న గులకరాయి విసిరిన కేసు అలాంటిది కూడా కాదు. తనకు రెండు లక్షల రూపాయలు ఆఫర్ చేసినట్టుగా 45 రోజులు జైల్లో ఉన్న సతీష్ చెబుతున్నాడు. చిన్న గులకరాయి విసిరి జగన్ ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించి.. ప్రజల సానుభూతి పొందే అవకాశం ఉండగా.. 2 లక్ష్లల కంటె పెద్దమొత్తంలో ఆఫర్ చేసి ఉండొచ్చు. అలా చేస్తే సతీష్ కాకపోతే పోయె.. ఎవరో ఒకరు ఖచ్చితంగా దొరుకుతారు.
కానీ.. ఇక్కడ ఒక పెద్ద ట్విస్టు ఉంది. సతీష్ ను మాత్రమే పోలీసులు అంతగా ఎందుకు ఒత్తిడిచేశారు, భయపెట్టారు అనడానికి తర్కం ఉంది. ఎందుకంటే.. కేసు ఒప్పుకునే వాడు.. ఆరోజు ఖచ్చితంగా జగన్ రోడ్ షో లో పాల్గొన్నట్టుగా చిన్న ఆధారం ఉండాలి. సంఘటన సీన్లో ఉన్నట్టు ఆధారం లేకపోయినా పర్లేదు. వాడికి తెలుగుదేశానికి చెందిన ఎవరితోనైనా సంబంధం ఉండాలి. అలా జల్లెడ పట్టినప్పుడు పోలీసులకు సతీష్ దొరికాడు. దుర్గారావు బంధువు గనుక, ఒకే కాలనీకి చెందిన వారు గనుక.. సతీష్ తో నేరం ఒప్పించేస్తే.. దుర్గారావును బుక్ చేయొచ్చుననుకున్నారు. కానీ.. సతీష్ ఒప్పుకోకపోవడంతో వారి పాచిక పారలేదు అని ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories