ఓవరాక్షన్ ఫలితం: సుప్రీంలోనూ పరువు హుళక్కి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దూకుడుగు నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు.. తలా తోకాలేని, చట్ట విరుద్ధమైన, అసమంజసమైన నిర్ణయాలు తీసుకోవడం బాగా అలవాటు! చట్టానికి లోబడే వ్యవస్థలు వాటిని తప్పు పడితే, తల ఎగరేయడం ధిక్కరించడం కూడా ఆయనకు అలవాటు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం.. చట్ట వ్యతిరేకమైన అలాంటి వాటి గురించి ఎవరైనా కోర్టుకు వెళితే.. కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ.. కేసులు నడిపించడం చిట్టచివరికి కోర్టు ద్వారా ఓటమిపాలు కావడం అనేది గత ఐదేళ్లలో ఒక రొటీన్ ప్రక్రియ గా మారిపోయింది. జగన్ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయాలను ప్రజలు న్యాయ పీఠం ఎదుట సవాలు చేసినప్పుడు ఆయనకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. ఏ రోజూ ఆయన సిగ్గుపడలేదు, అవమానంగా భావించలేదు. ఆయన నిర్ణయాలు హైకోర్టు తోసిపుచ్చినా కూడా, ఆయన మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ కేసులు నడిపించిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న అతిశయమైన అలాంటి తప్పుడు నిర్ణయాల విషయంలో 90% వరకు సుప్రీంకోర్టు ద్వారా కూడా పరాభవాలే ఆయనకు ఎదురయ్యాయి. ప్రభుత్వం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దిగిపోతున్న ప్రస్తుత కీలక తరుణంలో కూడా ఆయన అలవాటు మాత్రం మానడం లేదు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ మరోసారి దారుణమైన పరాభవానికి గురయ్యారు జగన్.
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఉద్యోగుల అధిక సంఖ్యలో పాల్గొని దాదాపు నాలుగున్నర లక్షల ఓట్లు వేసేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంగారు మొదలైంది. ఆ ఓట్లు చెల్లుబాటు కాకుండా చూడాలని వారు రకరకాల కుయత్నాలు చేశారు. డిక్లరేషన్ ఫారం మీద సంతకం ఉన్నప్పటికీ స్టాంపు, హోదా తదితర వివరాలు లేకుండా లేకుండా పొరపాటుగా చాలా పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు ఈసారి పడ్డాయి. ఆ ఓట్లని చెల్లకుండా చేయడానికి వైసిపి కుట్ర పన్నింది. ఏడాది కిందట కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంటూ.. స్టాంపు, అధికారి హోదా తదితర వివరాలు లేకపోతే ఆ ఓటును లెక్కించకూడదు అని డిమాండ్ చేసింది. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. అయితే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో జరిగిన పొరపాటును గ్రహించిన న్యాయస్థానం, సంతకం ఒక్కటి ఉన్నా సరిపోతుంది అనే ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేము అంటూ పిటిషన్ ను తిప్పి కొట్టింది.
వైసిపి పాచిక పారకపోయేసరికి.. వారిలో ఓటమి భయం బయటపడి, పరువు గల్లంతయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతటితో ఊరుకున్నా కూడా సరిపోయేది. కానీ అలా చేయకుండా, సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. మంగళవారం నాడు ఎన్నికల కౌంటింగ్ జరగబోతుండగా.. సోమవారమే సుప్రీంకోర్టు ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పిటిషన్ను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. దీంతో పార్టీ పరువు సమూలంగా మంట కలిసినట్లు అయింది. పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యకు తగిన తేడాతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయ్యే పరిస్థితి వస్తే గనుక.. ఆ పార్టీ వారు ఇంకా ఎన్ని ఏడుపులు ఏడుస్తారో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories